పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - మధురకాండ : శ్రీకృష్ణుఁడు నందుని కడకు వచ్చుట

లుఁడుఁ దానును నందుపాలి కేతెంచి
లిసి యాతనిఁ జిక్క కౌఁగిటఁ జేర్చి
భోజాధిపతి యింటఁ బొలుచు వస్తువులు
రాజ్యయోగ్యములైన వణంబులిచ్చి
ని మన్నించి నెయ్యము తియ్యదనము
తిగారవంబున మర నిట్లనియె.   - 290
“నీవు నీ సతియును నెమ్మిఁ బోషించి 
ప్రోవఁగఁ బ్రతికిన ప్రోఢల మేము
ల్లియుఁ దండ్రియు నములియ్యమును
నెల్ల బంధువులును నిటమాకు నీవ; 
మంలోపలికి నెమ్మది నేఁగి మీర
లంఱి సేమంబు డిగితి మనుఁడు; 
యేనాఱుదినముల యీలోనె నచటి
కే నేఁగుదెంచెద నీవంతమాను”, 
నివారి నూరార్చి నుప నందుండుఁ 
నియె గోపాలకమితియుఁ దాను. 
అంట నిశ్శంక నారాత్రి సౌఖ్య
సంతోషలీలలు లిపిరింపొంద
రునాఁడు శౌరి కుమారులఁ జూచి